Breaking News
Home / States / నిజామాబాద్‌లో రావణ దహన కార్యక్రమం

నిజామాబాద్‌లో రావణ దహన కార్యక్రమం

నిజామాబాద్: ఈ నెల 8వ తేదీ విజయదశమిని పురస్కరించుకుని నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రావణ దహన కార్యక్రమం జరగనుంది. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారి ఆదేశాలనుసారం రావణ దహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు అవంతి తెలిపారు. జాగృతి ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరాల నుండి నిజామాబాద్ నగరంలో రావణ దహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడుకు చెందిన దాదాపు 35 అడుగుల ప్రతిమలను ఏర్పాటు చేసి వాటి దహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు అందరూ హాజరవుతారని తెలిపారు, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *