Breaking News
Home / States / గాంధీ ఆస్పత్రికి టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ తరలింపు

గాంధీ ఆస్పత్రికి టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ తరలింపు

హైదరాబాద్‌: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ను వైద్య పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల తర్వాత రవిప్రకాష్‌ని మారేడుపల్లిలోని న్యాయమూర్తి నివాసంలో పోలీసులు హాజరుపర్చనున్నారు. ఇదిలా ఉంటే.. రవిప్రకాష్ అరెస్ట్‌పై వెస్ట్‌జోన్ ఇన్‌ఛార్జ్ డీసీపీ సుమతి వివరాలు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం సింగారావు ఇచ్చిన ఫిర్యాదుతో రవిప్రకాష్‌ని అరెస్ట్‌ చేశామని డీసీపీ సుమతి చెప్పారు.

టీవీ9 బోర్డుకు తెలియకుండా కోట్లాది రూపాయలు వ్యక్తిగతంగా వాడుకున్నట్టు ఆధారాలు దొరికాయని ఆమె తెలిపారు. ఇంకా లోతైన విచారణ చేయాల్సి ఉందని, రవిప్రకాష్‌ని కస్టడీకి తీసుకుంటామని వెల్లడించారు. రవిప్రకాష్‌పై 409, 418, 420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు డీసీపీ సుమతి తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *