Breaking News
Home / World News / భారత్‌లో క్రిప్టో కరెన్సీల ఉపయోగంపై RBI నిషేధం

భారత్‌లో క్రిప్టో కరెన్సీల ఉపయోగంపై RBI నిషేధం

వాషింగ్టన్: క్రిప్టో కరెన్సీ విషయంలో అప్రమత్తంగా ఉండటం మంచిదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికాలో ఉన్న ఆమె మీడియాతో మాట్లాడారు. ఫేస్‌బుక్‌ ప్రతిపాదిత క్రిప్టో కరెన్సీ లిబ్రాపై అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పారు. క్రిప్టో కరెన్సీల విషయంలో చాలా దేశాలు జాగ్రత్తగా ఉంటున్నాయని వెల్లడించారు. భారత్‌లో క్రిప్టో కరెన్సీల ఉపయోగంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో భారత్‌లో క్రిప్టో కరెన్సీ అంశంపై ఆర్బీఐదే తుది నిర్ణయమని చెప్పారు.

కాగా, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ క్రిప్టో కరెన్సీని ప్రారంభించిన విషయం తెలిసిందే. లిబ్రా పేరుతో డిజిటల్ కరెన్సీ సేవలను ప్రారంభించేందుకు అడుగు ముందుకు వేసింది. ఈ డిజిటల్ కరెన్సీపై పలు అమెరికా ఆర్థిక సంస్థలు, రాజకీయనేతలు విమర్శలు సంధించినప్పటికీ ఇవేమీ పట్టించుకోలేదు. జెనీవాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రభుత్వేతర సంస్థ లిబ్రా అసోసియేషన్ ఫేస్‌బుక్ యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఒక దేశం నుంచి మరో దేశంలో ఉన్నవారికి నగదు బదిలీ చేసేందుకు ఫేస్‌బుక్ ప్రయివేటు కరెన్సీ సిస్టంను తీసుకు వస్తుందని గతంలోనే వార్తలు వచ్చాయి. దీనిపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇలా చేస్తే ఫేస్‌బుక్‌లోని వినియోగదారుల వ్యక్తిగత సమాచారం లిబ్రా చేతుల్లోకి వెళ్లిపోతుందని ఆందోళనలు వ్యక్తం చేసిన వారు కూడా ఉన్నారు. కానీ ఈ విమర్శల్లో పసలేదని కొట్టి పారేశారు.

Check Also

అంతుచిక్కని మరో వైరస్.. వందలాది మంది మృతి

Share this on WhatsAppతమ పొరుగు దేశం కజకిస్థాన్‌లో అంతుచిక్కని వైరస్‌ కారణంగా వ్యాధులు ప్రబలి, వందలాది మంది మృత్యువాత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *