Breaking News
Home / National / ఆర్‌బీఐ నిధులపై కేంద్రం కన్ను

ఆర్‌బీఐ నిధులపై కేంద్రం కన్ను

రూ.3.6 లక్షల కోట్లు ఇవ్వాలన్న ఆర్థిక శాఖ
ఆర్‌బీఐ ధ్వంసానికి మోదీ కుట్ర: కాంగ్రెస్‌
‘గజిబిజి’ ప్రధాని గట్టెక్కేందుకే: రాహుల్‌
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరిన్ని జనాకర్షక పథకాల అమలుకు నిధుల కోసం మోదీ ప్రభుత్వం రిజర్వు బ్యాంక్‌(ఆర్‌బీఐ)పై కన్నేసింది. అత్యవసర సమయాల్లో వినియోగానికి వీలుగా ఆర్‌బీఐలో రూ.9.59లక్షల కోట్ల మిగులు నిధులు ఉన్నాయి. ఇందులో నుంచి రూ.3.6 లక్షల కోట్లు ఇవ్వాలని ఆర్‌బీఐని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఇటీవల కోరింది. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. ఆర్‌బీఐని నాశనం చేసేందుకు మోదీ సర్కారు కుట్ర పన్నిందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి మనీశ్‌ తివారీ విమర్శించారు.

కాగా, ‘గజిబిజి’ ఆర్థిక విధానాలతో దేశాన్ని పీకల్లోతు కష్టాల్లోకి నెట్టిన ప్రధాని మోదీ తన తప్పును కప్పిపుచ్చుకునేందుకే ఆర్‌బీఐ నిధులపై కన్నేశారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. ప్రధాని ప్రయత్నాలను నిలువరించి దేశాన్ని కాపాడాలని ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ను ట్విట్టర్‌లో కోరారు. ఇదిలా ఉండగా.. రద్దయిన నోట్లను ధ్వంసం చేసేందుకు ఎంత ఖర్చయిందో చెప్పేందుకు ఆర్‌బీఐ నిరాకరించింది. నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లోకి రూ.15,31,073 కోట్ల పాతనోట్లు వచ్చాయని, వాటిని ఈ ఏడాది మార్చిలో ధ్వంసం చేశామని ఆర్టీఐ కింద అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపింది. ఇంకా రూ.10,720 కోట్ల నోట్లు బ్యాంకులకు చేరలేదని పేర్కొంది.

Check Also

షిర్డీలో మహిళకు అవమానం: పోలీసులకు ఫిర్యాదు

Share this on WhatsAppషిర్డీ: మహారాష్ట్రలోని షిర్డీసాయిబాబా ఆలయంలో ఒక మహిళను వేధింపులకు గురిచేసిన ఉదంతం వెలుగు చూసింది. మందిరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *