Breaking News
Home / National / బందన్ బ్యాంకుకు ఆర్బీఐ భారీ జరిమానా….

బందన్ బ్యాంకుకు ఆర్బీఐ భారీ జరిమానా….

కోల్‌కతా: కోల్‌కతాకు చెందిన బందన్ బ్యాంకుకు కోటి రూపాయల జరిమానా విధించింది ఆర్బీఐ. ప్రమోటర్ షేర్‌ హోల్డింగ్‌ను 40 శాతానికి తీసుకురాలేదన్న కారణంతో ఆర్బీఐ ఈ మేరకు జరిమానా వేసినట్లు వెల్లడించింది. 2014లో బందన్ బ్యాంక్‌ ఆర్బీఐ నుంచి లైసెన్సు తీసుకున్నది. ఆ తర్వాత 2015 ఆగస్టు నుంచి పూర్తి స్థాయి బ్యాంకుగా లావాదేవీలు ప్రారంభించింది. 2018 మార్చిలో బందన్ బ్యాంకు ఐపీవో జారీ చేసింది. ఇటీవలే ఈ బ్యాంకు గృహ ఫైనాన్స్‌తో జతకలిసింది. దీంతో షేర్‌హోల్డింగ్‌ను 82.26 శాతం నుంచి 60.96 శాతానికి తీసుకువచ్చింది. అయితే షేర్ హోల్డింగ్‌ను 40 శాతానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఇటీవలే ఆ బ్యాంక్ వెల్లడించింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *