Breaking News
Home / Lifestyle / Business / కీలక వడ్డీ రేట్లు యథాతథం

కీలక వడ్డీ రేట్లు యథాతథం

ముంబై : భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలోని ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు రెపో రేటు, రివర్స్ రేటులను యథాతథంగా ఉంచాలని నిర్ణయించారు. దీంతో రెపో రేటు 6.50 శాతంగానూ, రివర్స్ రెపో రేటు 6.25 శాతంగానూ కొనసాగుతాయి. అక్టోబరులో జరిగిన ఆర్బీఐ ద్రవ్య విధాన సమీక్షా సమావేశంలో కూడా ఇదేవిధంగా అంతకుముందటి రేట్లనే యథాతథంగా కొనసాగించింది. చమురు ధరల పెరుగుదల, సంక్లిష్ట ప్రపంచ ఆర్థిక పరిస్థితుల వల్ల వృద్ధి, ద్రవ్యోల్బణాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపింది.

Check Also

పుచ్చలపల్లి సుందరయ్యకు నివాళులర్పించిన చంద్రబాబు

Share this on WhatsAppన్యూఢిల్లీ: కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్యకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *