Breaking News
Home / Lifestyle / Business / కొటక్ మహీంద్రా బ్యాంకుకు ఆర్బీఐ భారీ షాక్

కొటక్ మహీంద్రా బ్యాంకుకు ఆర్బీఐ భారీ షాక్

న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ సంస్థ కొటక్ మహీంద్రాకు భారతీయ రిజర్వు బ్యాంకు భారీ షాకిచ్చింది. ప్రమోటర్ల వాటాల విలీనం విషయంలో ఆర్బీఐ నిబంధనలు, సూచనలు పాటించలేదని పేర్కొంటూ శుక్రవారం రెండు కోట్ల రూపాయల జరిమానా విధించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949లోని నిబంధనల ప్రకారం జరిమానా విధిస్తున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది.

నిజానికి 2014 నుంచే కొటక్ మహీంద్రాపై ఆర్బీఐ గుర్రుగా ఉంది. బ్యాంక్ ప్రమోటర్ అయిన ఉదయ్ కొటక్ వాటాలు తగ్గించడంలో విఫలమైన విషయంలో బ్యాంకుకు ఆర్‌బీఐకి మధ్య వివాదం కొనసాగుతోంది. డిసెంబరు 31, 2018 నాటికి ప్రమోటర్ వాటాను గరిష్టంగా 20 శాతానికి, మార్చి 31, 2020 నాటికి 15 శాతానికి తగ్గించాలంటూ కొటక్ మహీంద్రా బ్యాంకును ఆర్‌బీఐ ఆదేశించింది. దీంతో ఆర్‌బీఐ ఆదేశాలను సవాలు చేస్తూ బ్యాంకు బాంబే హై కోర్టును ఆశ్రయించింది. వచ్చే ఏడాది జనవరిలో కోర్టు ఈ కేసును విచారించే అవకాశం ఉంది.

కాగా, తాజాగా ఆర్‌బీఐ నిబంధనలను ఉల్లంఘించిందంటూ కొటక్ మహీంద్రా బ్యాంకుకు భారీ జరిమానా విధిస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు జరిమానా ఎందుకు విధించకూడదో తెలపాని అందులో ప్రశ్నించింది. బ్యాంకు వివరణ అనంతరం జరిమానా విధించాలని నిర్ణయించినట్టు ఆర్‌బీఐ వివరించింది.

Check Also

మంగల్‌ పాండే వివాదాస్పద వ్యాఖ్యలు

Share this on WhatsAppపట్నా: బీహార్ లో మెదడువాపు వ్యాధి బారిన పడి 103 మంది చిన్నారు మృతి చెందిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *