Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా….

క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా….

అమరావతి: అమరావతి ప్రాజెక్టు తప్పు అని ప్రజలంటే.. క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిపై టీడీపీ రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి చంద్రబాబు అధ్యక్షత వహించారు.ఈ  సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతిలో ఏం జరుగుతోందో తెలిపేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశామని వివరించారు. ప్రజా రాజధాని అమరావతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అమరావతి భావితరాల భవిష్యత్‌ అని చెప్పుకొచ్చారు. అమరావతిపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని, ప్రజాచైతన్యం వల్లే అమరావతి నిలబడుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఉపాధి కల్పన, సంపద సృష్టే లక్ష్యంగా అమరావతిని నిర్మించాలనుకున్నామని తెలిపారు. ప్రతి తెలుగు బిడ్డ గర్వించే ప్రజా రాజధానిని నిర్మించ తలపెట్టామని చంద్రబాబు వివరించారు.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *