బెంగుళూరు: మరో నెల రోజులలో 15 శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ప్రజాకీయ పార్టీ వ్యవస్థాపకుడు, రియల్ స్టార్ ఉపేంద్ర అభ్యర్థుల వేటకు సిద్ధమయ్యారు. సోమవారం నుంచి 15 నియోజకవర్గాలలో పోటీ చేసే వారు సిద్ధం కావాలని ట్వీట్టర్ ద్వారా కోరారు. ఇకపై నిరంతరంగా అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. 79758 22460 నెంబరు తోపాటు మరో రెండు నెంబర్లు పోస్టు చేసి సమాచారం తెలుసుకోవాలన్నారు. ఈ ఫోన్ నెంబర్ల ద్వారా సంప్రదించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను వివరిస్తామని, ఆసక్తి కలిగి మాకు అంగీకారమైతేనే టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు.
