Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఫిబ్రవరి 15 నాటికి వీసీ పోస్టుల భర్తీ

ఫిబ్రవరి 15 నాటికి వీసీ పోస్టుల భర్తీ

అమరావతి: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న వైస్‌చాన్సెలర్ల పోస్టులన్నింటినీ ఫిబ్రవరి 15లోగా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆయా వర్సిటీలకు సంబంధించి సెర్చ్‌ కమిటీల సమావేశాలు జరుగుతున్నాయని చెప్పారు. విశ్వవిద్యాలయాల్లోని ఫ్యాకల్టీ నియామకాలపైనా కసరత్తు జరుగుతోందన్నారు.

ప్రస్తుతం రెగ్యులర్‌ వీసీలు ఉన్న ఆరు విశ్వవిద్యాలయాల్లో ఇంటర్వ్యూల నిర్వహణకు వీలుగా షెడ్యూల్‌ సిద్ధమైందని చెప్పారు. అయితే ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్‌కు ముందుగా కాంట్రాక్టు అధ్యాపకుల అంశాన్ని కూడా పరిష్కరించాల్సి ఉందన్నారు. ఇప్పటికే మంత్రుల కమిటీ సమావేశమై ఓ నిర్ణయానికి వచ్చిందని, ఈ నెల 21న జరిగే కేబినెట్‌లో చర్చించిన అనంతరం ఉత్తర్వులు వస్తాయన్నారు. అప్పటి వరకు వర్సిటీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించరాదని ఆయన రాష్ట్ర ఉన్నత విద్యా మండలికి సూచించారు.

Check Also

వైఎస్‌ జగన్-కేటీఆర్‌ భేటీపై కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్

Share this on WhatsAppఅమరావతి: లాంగ్ గ్యాప్ తర్వాత.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ మతబోధకుడు కేఏ పాల్ మీడియా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *