ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలో ఉగ్రవాదులు చొరబడ్డారన్న ఐబీ హెచ్చరికలతో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఉగ్రవాదుల్లో ఇద్దరు పాక్కు చెందినవారుగా అనుమానిస్తున్నారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. రహదారులపై వెళుతున్న వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
