Breaking News
Home / States / Andhra Pradesh / శ్రీశైలానికి తగ్గిన వరద

శ్రీశైలానికి తగ్గిన వరద

శ్రీశైలం : శ్రీశైల జలాశయానికి ఎగువ ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టింది. దీంతో రెండు క్రస్ట్‌గేట్ల ద్వారా మాత్రమే సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, నీటినిల్వలు 215.8070 టీఎంసీలు. సోమవారం సాయంత్రం 6గంటల సమయానికి 884.70 అడుగులు, జలాశయ నీటినిల్వ సామర్థ్యం 213.8824 టీఎంసీలుగా నమోదయ్యా యి. జలాశయానికి 1,71,794 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. కుడిగట్టు, ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ జలాశయం నుంచి 69,012 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటున్నారు. డ్యాం 2 రేడియల్‌ క్రస్ట్‌గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 55,874 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జలాశయం నుంచి ఔట్‌ఫ్లో 1,24,886 క్యూసెక్కులు ఉంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *