Breaking News
Home / States / Andhra Pradesh / శ్రీశైలానికి తగ్గిన వరద

శ్రీశైలానికి తగ్గిన వరద

శ్రీశైలం: శ్రీశైల జలాశయానికి ఎగువ ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద ప్రవాహం తగ్గుముఖం పట్టి స్వల్పంగా ప్రవహిస్తుంది. జలాశయానికి బుధవారం వరద ప్రవాహం స్వల్పంగా పెరగడంతో 2 క్రస్ట్‌గేట్ల ద్వారా నీరు విడుదల చేశారు. గురువారం ఉదయానికి జలాశయానికి నీటిప్రవాహం స్వల్పంగా ప్రవహించడంతో తెరచిన 2 క్రస్ట్‌గేట్లను పూర్తిగా మూసివేశారు. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, నీటినిల్వలు 215.8070 టీఎంసీలు. కాగా గురువారం సాయంత్రం 6గంటల సమయానికి 884.40 అడుగులు, జలాశయ నీటినిల్వ సామర్థ్యం 212.4385 టీఎంసీలుగా నమోదయ్యాయి. జూరాల జలాశయ విద్యుదుత్పత్తి ద్వారా 37,891 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 22,060 క్యూసెక్కులు మొత్తం జలాశయానికి 59,951 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ప్రవహిస్తోంది. శ్రీశైలం కుడిగట్టు విద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ జలాశయం నుంచి 30,437 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటున్నారు. ఎడమగట్టు భూగర్బ జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ జలాశయం నుంచి 42,378 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటున్నారు. మొత్తం జలాశయం నుంచి ఔట్‌ఫ్లోగా 72,815 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. గడచిన 24గంటల వ్యవధిలో కుడి, ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రాల నుంచి 35.398 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తిచేసి గ్రిడ్‌కు అందించారు. గడచిన 24గంటల వ్యవధిలో జలాశయానికి 1,89,426 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. జలాశయం నుంచి 1,83,426 క్యూసెక్కుల నీటిని ఔట్‌ఫ్లోగా విడుదల చేశారు. గడచిన 24గంటల వ్యవధిలో 10.60మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *