Breaking News
Home / States / Andhra Pradesh / శ్రీశైలానికి తగ్గిన వరద

శ్రీశైలానికి తగ్గిన వరద

శ్రీశైలం: శ్రీశైలం డ్యాంకు ఆదివారం వరద మరింత తగ్గింది. జూరాల నుంచి విద్యుదుత్పత్తి ద్వారా 40,583 క్యూసెక్కులు, క్రస్ట్‌గేట్ల ద్వారా 83,576 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 17,516 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 110 క్యూసెక్కుల వరద వస్తోంది. మొత్తం ఇన్‌ఫ్లో 1,41,785 క్యూసెక్కులుగా నమోదైంది. దీంతో ఒక క్రస్ట్‌ గేట్‌ నుంచి సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమగట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి 884.80 అడుగుల వద్ద 214.8450 టీఎంసీల నిల్వలు నమోదయ్యాయి. విద్యుదుత్పత్తి కోసం కుడిగట్టు కేంద్రంలో 26,190 క్యూసెక్కులు, ఎడమగట్టు కేంద్రంలో 42,378 క్యూసెక్కులు వినియోగించుకుంటున్నారు.

ఒక రేడియల్‌ క్రస్ట్‌గేట్‌ను 10 అడుగుల మేర ఎత్తి 27,937 క్యూసెక్కులు వదులుతున్నారు. జలాశయం మొత్తం ఔట్‌ ఫ్లో 96,505 క్యూసెక్కులు. గడచిన 24 గంటలలో 32.607 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసి గ్రిడ్‌కు అందించారు. గడచిన 24 గంటల వ్యవధిలో జలాశయానికి 2,61,472 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. జలాశయం నుంచి 2,44,760 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 6.20 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *