ఢిల్లీ: దేశంలో చమురు ధరలు వరుసగా రెండోరోజూ తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్కతాలలో పెట్రోల్ ధర లీటరుకు 18 పైసలు తగ్గగా, చెన్నైలో 19 పైసలు తగ్గింది. ఇక డీజిల్ విషయానికి వస్తే ఢిల్లీ, ముంబై కోల్కతాలలో లీటరుకు 8 పైసలు తగ్గగా, చెన్నైలో 9 పైసలు తగ్గింది. ఈ తగ్గుదల అనంతరం దేశంలోని ముఖ్య నగరాలలో పెట్రోల్ ధరలు లీటరుకు ఈ విధంగా ఉన్నాయి.. ఢిల్లీ: రూ. 74.33, కోల్కతా: రూ.76.96, ముంబై: రూ.79.93, చెన్నై: రూ.77.21. డీజిల్ ధరలు లీటరుకు.. ఢిల్లీ: రూ. 67.35, కోల్కతా: రూ.69.71, ముంబై: రూ.70.61, చెన్నై: రూ.71.15. అయితే పండగ సీజన్లో వీటి ధరలు తగ్గడం వినియోగదారులకు కాస్త ఉపశమనమేనని చెప్పాలి.
