Breaking News
Home / Lifestyle / Business / భారత్‌లో తగ్గిన ఒప్పో ‘ఎ5 2020’ ధర…

భారత్‌లో తగ్గిన ఒప్పో ‘ఎ5 2020’ ధర…

న్యూఢిల్లీ: వెనకవైపు నాలుగు కెమెరాలు కలిగిన ఒప్పో ఎ5 2020 స్మార్ట్‌ఫోన్ ధర భారత్‌లో తగ్గింది. గత నెలలోనే ఇది విడుదల కాగా, ఇప్పుడు దీని ధరను రూ.500 తగ్గించి రూ.11,990కే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ధర తగ్గింపు శాశ్వతమని ఒప్పో పేర్కొంది.

ఒప్పో ఎ5 2020 3జీబీ+64 జీబీ మోడల్ అసలు ధర రూ.12,490. ఇప్పుడు దీని ధరను రూ.500 తగ్గించడంతో రూ.11,990కే అందుబాటులోకి వచ్చింది. ఇందులో 4జీబీ+64 జీబీ వేరియంట్ ధర రూ.13,990.

ఒప్పో ఎ5 2020 స్పెసిఫికేషన్లు: ఆండ్రాయిడ్ 9పై ఓఎస్, 6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌ డ్రాగన్ 665 చిప్‌సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 256 జీబీ వరకు మెమొరీని పెంచుకునే వెసులుబాటు, 12 ఎంపీ+8ఎంపీ+2ఎంపీ+2ఎంపీ రియర్ క్వాడ్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా.

Check Also

భారత్‌లో వివో డిజైన్‌ సెంటర్‌

Share this on WhatsApp50,000కు పెరగనున్న ఉద్యోగుల సంఖ్య ప్రీమియం సెగ్మెంట్‌లో ఎక్స్‌50 స్మార్ట్‌ఫోన్ల ఆవిష్కరణ ధర రూ. 34,990 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *