ముంబై: దేశీయ టెలికాం సంస్థ ఎయిర్టెల్ హెచ్డి, ఎస్డి సెట్-టాప్ బాక్స్‌ల ధరలను తగ్గించింది. డీటీహెచ్ ఆపరేటర్లలో రోజు రోజుకు పోటీ పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా కొత్త వినియోగదారులను ఆకర్షించనుంది. గత త్రైమాసికంలో నాలుగు లక్షలమంది ఖాతాదారులను తన ఖాతాలో చేర్చుకున్న భారతి ఎయిర్టెల్ ఇపుడు సెట్-టాప్ బాక్సల ధరలను రూ. 500 వరకు తగ్గించింది.
ఎయిర్టెల్ అధికారిక వెబ్సైట్ ప్రకారం, ఎయిర్టెల్ డిజిటల్ టీవీ కస్టమర్లు ఇప్పుడు రూ .1300 వద్ద హెచ్డి సెట్-టాప్ బాక్స్‌ను పొందవచ్చు, ఇప్పటివరకు దీని ధర రూ .1800గా ఉంది. ఈ తగ్గింపుతో హెచ్డి బాక్స్ రూ.1,300 ధరతో అందిస్తుండగా, ఎస్డీ సెట్-టాప్ బాక్స్‌ను ఇప్పుడు కేవలం రూ.1100ల ధర వద్ద అందిస్తోంది.