Breaking News
Home / Film News / ‘‘అల వైకుంఠపురములో’’ రిలీజ్ డేట్ వచ్చేసింది

‘‘అల వైకుంఠపురములో’’ రిలీజ్ డేట్ వచ్చేసింది

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ బ్యానర్స్‌లపై ఈ సినిమా రూపొందుతోంది. అల వైకుంఠపురంలో’ని మొదటిపాట ‘సామజవరగమన’ ఇటీవల విడుదలై మంచి ఆదరణకు నోచుకుంది. అంతకు ముందు వచ్చిన టీజర్, పోస్టర్‌లకు కూడా మంచి స్పందన వచ్చింది.

అయితే ఈ సినిమాని సంక్రాంత్రి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన విడుదల చేస్తున్నట్లు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్‌ని కూడా ఆయన విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో బన్ని ఓ చేతిలో కోడి పుంజును, మరో చేతిలో కొడవలి పట్టుకొని పల్లెటూరి గెటప్‌లో కనిపిస్తున్నాడు. చాలాకాలం తర్వాత బన్నీ సినిమా విడుదల తేదీ రావడంతో అతని అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. కాగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో హీరో సుశాంత్, టబూ, నివేథా పేతురాజ్, జయరామ్, సత్యరాజ్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, సునీల్, నవదీప్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *