హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన నీరా విధానానికి సంబంధించిన మార్గదర్శకాల జీవోను మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్ విడుదల చేశారు. నీరా విధానం జీవో విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రులు తెలిపారు. త్వరలోనే ప్రభుత్వం తరఫున నీరా స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. దశల వారీగా అన్ని జిల్లాల్లో నీరా ఉత్పత్తి, సరఫరాలను విస్తరిస్తామన్నారు. నీరాలో అనేక ఔషధ గుణాలున్నాయని తెలిపారు.
