Breaking News
Home / States / మేయర్, చైర్మన్ పరోక్ష ఎన్నికకు షెడ్యూల్ విడుదల

మేయర్, చైర్మన్ పరోక్ష ఎన్నికకు షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ : రాష్ట్రంలో 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు బుధవారం ఎన్నికలు జరిగిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎంపికకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ అయింది. మున్సిపాల్టీలు, కార్పొరేషన్‌ల మేయర్, ఛైర్మన్ పరోక్ష ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 27 న ఉదయం 11 గంటలకు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేస్తారు. అదే రోజు 12 గంటల 30 నిమిషాలకు మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికను పరోక్ష పద్దతిలో నిర్వహిస్తారు. ఈ ఎన్నికలను పర్యవేక్షించే అధికారం కలెక్టర్లకు ఇచ్చారు. ఈ ప్రక్రియకు సంబంధించిన నోటీసును  అధికారులు ఈ నెల 25న జారీ చేయనున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *