Breaking News
Home / Education / పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల…

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల…

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడ్డ పదో తరగతి పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. హైకోర్టు ఇటీవల జారీచేసిన మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. జూన్‌ 8న ఇంగ్లీష్‌ మొదటి పేపర్‌తో పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలన్నీ ఉదయం 9.30 నుంచి మధ్యాహం 12.15 నిమిషాలకు వరకు జరుగనున్నాయి.

పరీక్షల షెడ్యూల్‌..

జూన్‌ 8వ తేదీ ఇంగ్లీష్‌ మొదటి పేపర్‌
11వ తేదీ ఇంగ్లీష్‌ రెండో పేపర్‌
14వ తేదీ గణితము మొదటి పేపర్‌
17వ తేదీ గణితము రెండో పేపర్‌
20వ తేదీ  సామాన్యశాస్త్రము మొదటి పేపర్‌
23వ తేదీ  సామాన్యశాస్త్రము రెండో పేపర్‌
26వ తేదీ సాంఘిక శాస్త్రం మొదటి పేపర్‌
29వ తేదీ  సాంఘిక శాస్త్రం రెండో పేపర్‌
జూలై 02వ తేదీ  ఓరియంటర్‌ మొయిన్‌ లాంగ్వేజ్‌ మొదటి పేవప్‌ (సంస్కృతము, అరబిక్‌)
జూలై 05వ తేదీ  ఓరియంటర్‌ మొయిన్‌ లాంగ్వేజ్‌ రెండో పేపర్‌ (సంస్కృతము, అరబిక్‌)

Check Also

13 న‌గరాల్లోనే లాక్‌డౌన్ 5.0..

Share this on WhatsAppన్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ 4.0 ముగుస్తున్న త‌రుణంలో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలపై క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *