Breaking News
Home / Featured / వార్డుల పునర్విభజన ..

వార్డుల పునర్విభజన ..

హైదరాబాద్‌: రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణలో పురపాలక ఎన్నికల దిశగా ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలక శాఖ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లన్నీ తోసిపుచ్చిన హైకోర్టు… వార్డుల పునర్విభజన సహా, ఇతర ప్రక్రియకు మళ్లీ షెడ్యూల్‌ ఇవ్వాలని ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ షెడ్యూల్‌ విడుదల చేసింది. అందుకు అనుగుణంగా పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వార్డుల పునర్విభజనకు హైకోర్టు సూచించిన మేరకు.. ఏడు రోజుల పాటు అభ్యంతరాలకు అవకాశం ఇచ్చి, మరో ఏడు రోజుల పాటు వాటి పరిష్కారానికి గడువు విధిస్తూ షెడ్యూల్‌ ప్రకటించారు.ఇవాళ్టి నుంచి ఈనెల 9వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ముసాయిదాపై అభిప్రాయాలు, సూచనలు స్వీకరిస్తారు. సాధారణ ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అభ్యంతరాలు, వినతుల పరిష్కారానికి ఈనెల 16 వరకు గడువు విధించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *