Breaking News
Home / States / Andhra Pradesh / నాగార్జునసాగర్‌ నుంచి 2 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల

నాగార్జునసాగర్‌ నుంచి 2 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల

గుంటూరు/విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌కు శ్రీశైలం నుంచి వరదనీరు వచ్చి చేరడంతో ప్రాజెక్ట్‌ అధికారులు గురువారం 2 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు 79,866 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. నాగార్జున సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ఇది 312.08 టీఎంసీలకు సమానం. నాగార్జునసాగర్‌ నీటిమట్టం 589.90 అడుగులకు చేరింది. ఇది 311.74 టీఎంసీలకు సమానం.

కాగా నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి కుడికాలువ ద్వారా 10,120 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 6634, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం 32,967, డైవర్షన్‌ టర్నల్‌ ద్వారా 10, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800, లోలెవల్‌ కెనాల్‌ ద్వారా 300 క్యూసెక్కులు, 2 క్రస్ట్‌గేట్లను ఐదు అడుగులమేర ఎత్తి 16,178 క్యూసెక్కులు… మొత్తంగా 68,009 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ఇది 215 టీఎంసీలకు సమానం. శ్రీశైలం నీటిమట్టం 884.80 అడుగులకు చేరింది. ఇది 214.84 టీఎంసీలకు సమానం. జూరాల,రోజాల నుంచి శ్రీశైలానికి 55,617 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *