Breaking News
Home / States / Andhra Pradesh / రబీ సాగుకు నీరు విడుదల

రబీ సాగుకు నీరు విడుదల

పగిడ్యాల: ముచ్చుమర్రి ఎత్తిపోతల డ్యాం నుంచి రెండు మోటార్ల ద్వారా 500 క్యూసెక్కుల నీటిని కేసీ కాలువలోకి శనివారం డ్యాం అధికారులు విడుదల చేశారు. ఈ నెల 11న రైతులు రబీలో సాగుచేసిన ఆరుతడి పంటలు ఎండిపోతున్నాయంటూ నిరసన తెలుపుతూ ముచ్చుమర్రి ఎత్తిపోతల డ్యాం వద్ద ధర్నా చేశారు. వారి అభ్యర్థన మేరకు సాగు నీటిని విడతల వారీగా వదులుతామని ఉన్నతాధికారులు తెలిపారు. రైతులు సాగుచేసే ఆరుతడి పంటలు ఎండిపోకుండా వాటికి అవసరమయ్యేంత సాగునీరు విడుదలచేస్తామని ఈఈ రెడ్డిశేఖర్‌ తెలిపారు. రబీ సాగుకు నీటిని విడుదల చేయడంపై రైతన్నలు హర్షం వ్యక్తం చేశారు.

Check Also

వైఎస్‌ జగన్-కేటీఆర్‌ భేటీపై కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్

Share this on WhatsAppఅమరావతి: లాంగ్ గ్యాప్ తర్వాత.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ మతబోధకుడు కేఏ పాల్ మీడియా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *