Breaking News
Home / National / రిలయన్స్‌ బోర్డులో కేవీ చౌదరికి కీలక బాధ్యతలు….

రిలయన్స్‌ బోర్డులో కేవీ చౌదరికి కీలక బాధ్యతలు….

ముంబయి: మాజీ సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇండియా కేవీ చౌదరి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో స్వతంత్ర డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1978 ఇండియన్‌ రెవెన్యూ సర్వీసెస్‌(ఐఆర్‌ఎస్‌) బ్యాచ్‌కు చెందిన ఆయన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుకు ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఈ సంస్థ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌కు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఆయన పదవీ విరమణ చేశాక రెవెన్యూశాఖకు సలహాదారుగా నియమితులయ్యారు. నల్లధనంపై తీసుకోవాల్సిన చర్యలపై ఆయన సూచనలు చేశారు. ఆయన 2015 నుంచి 2019 జూన్‌ వరకు సీవీసీగా బాధ్యతలు నిర్వహించారు.

ఆయన నియామక సమాచారాన్ని రిలయన్స్‌ రెగ్యూలేటరీకి సమర్పించిన ఫైలింగ్‌లో వెల్లడించింది. చౌదరిని నాన్‌ ఎగ్జిక్యూటీవ్‌ అడిషనల్‌ డైరెక్టర్‌గా నియమించడానికి శుక్రవారం జరిగిన బోర్డు మీటింగ్‌లో డైరెక్టర్లు ఆమోదముద్ర వేసినట్లు వెల్లడించింది. ”చౌదరీ బాధ్యతలు కంపెనీలోని ఏ డైరెక్టర్‌కు అనుబంధంగా ఉండవు” అని రిలయన్స్‌ పేర్కొంది.

Check Also

ఐదో వికెట్ కోల్పోయిన భారత్…

Share this on WhatsAppఇండోర్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. 303 బంతుల్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *