Breaking News
Home / Lifestyle / Business / ఔట్‌గోయింగ్‌ కాల్స్‌ పరిమితి ఎత్తివేత…

ఔట్‌గోయింగ్‌ కాల్స్‌ పరిమితి ఎత్తివేత…

ఢిల్లీ:ఇతర నెట్‌వర్కులకు చేసే కాల్స్‌ విషయంలో అన్‌లిమిటెడ్‌ ప్లాన్లలో ఉన్న పరిమితిని ఎత్తివేస్తూ టెలికాం ఆపరేటర్‌ భారతీ ఎయిర్‌టెల్‌ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‌ 3 నుంచి అమల్లోకి తీసుకొచ్చిన కొత్త పాన్లలో ఈ మేరకు మార్పు చేసింది.ఎయిర్‌టెల్‌ ఇటీవల తన ప్రీపెయిడ్‌ ప్లాన్ల ధరలను గరిష్ఠంగా 50 శాతం వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలు కొత్త అన్‌లిమిటెడ్‌ ప్లాన్లు ప్రకటించింది. 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌పై 1000 నిమిషాలు, 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌కు 3వేలు, 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌పై 12వేల నిమిషాల పరిమితి విధించింది. ఆ పరిమితి దాటిన తర్వాత ఇతర నెట్‌వర్క్‌కు చేసే కాల్స్‌కు నిమిషానికి ఆరు పైసలు వసూలు చేస్తామని ప్రకటించింది. శనివారం నుంచి అన్‌లిమిటెడ్‌ ప్లాన్లు ఉపయోగించి దేశవ్యాప్తంగా ఏ ఇతర నెట్‌వర్క్‌కు అయినా అపరిమితంగా మాట్లాడొచ్చని, ఎలాంటి షరతులూ ఉండబోవని ఎయిర్‌టెల్‌ ట్వీట్‌ చేసింది.

Check Also

భారత్‌లో వివో డిజైన్‌ సెంటర్‌

Share this on WhatsApp50,000కు పెరగనున్న ఉద్యోగుల సంఖ్య ప్రీమియం సెగ్మెంట్‌లో ఎక్స్‌50 స్మార్ట్‌ఫోన్ల ఆవిష్కరణ ధర రూ. 34,990 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *