Breaking News
Home / States / Andhra Pradesh / శ్రీశైలం జలాశయానికి మళ్లీ పెరిగిన వరద

శ్రీశైలం జలాశయానికి మళ్లీ పెరిగిన వరద

కర్నూలు : శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం మళ్లీ పెరిగింది. ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశం కనిపిస్తోంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 3,36,315 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 68,743 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం 884 అడుగులు ఉంది. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం గరిష్టంగా 210.0320 టీఎంసీల నీరు ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు భారీగా కురుస్తుండటంతో కృష్ణా నదికి మళ్లీ వరద పోటెత్తుతోంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *