Breaking News
Home / hyderabad / సిఎఎ కు వ్యతిరేకంగా పంజాబ్‌ అసెంబ్లీలో తీర్మానం

సిఎఎ కు వ్యతిరేకంగా పంజాబ్‌ అసెంబ్లీలో తీర్మానం

హైదరాబాద్‌ : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పంజాబ్‌ అసెంబ్లీ శుక్రవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆ తీర్మానాన్ని ఆమోదించారు. వివాదాస్పద సిఎఎ ను రద్దు చేయాలని పంజాబ్‌ ప్రభుత్వం డిమాండ్‌ చేసింది. రాష్ట్ర మంత్రి బ్రహ్మ మోహింద్ర .. సిఎఎ కు వ్యతిరేకంగా సభోల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పార్లమెంట్‌లో పాసైన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలు వెల్లువెత్తాయని, పంజాబ్‌లోనూ హింస చోటుచేసుకుందని, అందుకే ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఇటీవలే కేరళ అసెంబ్లీ కూడా సిఎఎ ను వ్యతిరేకిస్తూ తీర్మానం పాస్‌ చేసింది.

Check Also

నేటి నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌

Share this on WhatsAppఆదిలాబాద్: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా వాంకిడి మండల కేంద్రంలో గురువారం నుంచి వారం రోజుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *