ఐపీఎల్ జరగకుంటే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడం కష్టమవుతుందని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ధోనీ ఐపీఎల్లో రాణిస్తే టీ20 ప్రపంచకప్‌కు ఎంపికయ్యే అవకాశం ఉండేదని, కానీ కరోనా వల్ల ఐపీఎల్ జరిగే అవకాశం లేకపోవడంతో ధోనీకి చాలా కష్టమవుతుందన్నాడు. ధోనీ స్థానాన్ని కేఎల్ రాహుల్‌తో భర్తీ చేస్తే బాగుంటుందన్నాడు. రిటైర్మెంట్ అనేది ధోనీ ఇష్టమని గంభీర్ చెప్పాడు.
