శ్రీకాకుళం: మంగళవారం ఉదయం పెద్దపాడులోని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును జిల్లా రెవెన్యూ అసోసియేషన్ నూతన కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిసింది. ధర్మాన నివాసంలో కలిసిన సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.కాళీ ప్రసాద్, ధర్మానకు పుష్పగుచ్ఛాన్ని అందించారు. జిల్లా రెవెన్యూ అసోసియేషన్ సేవలు విస్తృతం కావాలని నూతన కార్యవర్గం ప్రతినిధులకు ధర్మాన సూచించారు. ధర్మానను కలిసిన వారిలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు వెంకట్రావు, శారద, శ్రీను, రాజు, ప్రకాష్ తదితరులు ఉన్నారు.
