Breaking News
Home / National / కైలాస్ మానససరోవర్ యాత్ర ఏర్పాట్లపై ఆర్మీ అధికారుల సమీక్ష

కైలాస్ మానససరోవర్ యాత్ర ఏర్పాట్లపై ఆర్మీ అధికారుల సమీక్ష

న్యూఢిల్లీ : ప్రకృతి ప్రసాదించిన హిమాలయాల అందాలను మనం కాపాడుకోవాలని ఐటీబీపీ డైరెక్టరు జనరల్ ఎస్ఎస్ దేశాయ్ పర్యాటకులను కోరారు.శుక్రవారం కైలాస్ మానససరోవర్ యాత్ర సందర్భంగా ఏర్పాట్లను సమీక్షించేందుకు లిపులేఖ్ పాస్ ప్రాంతాలను ఐటీబీపీ డైరెక్టరు జనరల్ ఎస్ఎస్ దేశాయ్ తన బృందంతో సందర్శించి యాత్ర ఏర్పాట్లను సమీక్షించారు.హిమాలయాలను పరిశుభ్రంగా ఉంచి, పర్యావరణాన్ని పరిరక్షించాలని దేశాల్ పర్యాటకులను కోరారు. హిమాలయాల్లో సందర్శించే యాత్రికులు, పర్వతారోహకులు చెత్తను కొండలపై వేయవద్దని సూచించారు. చెత్తను సేకరించేందుకు ఐటీబీపీ చెత్త సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. లిపులేఖ పాస్ మీదుగా కైలాస్ మానససరోవర్ యాత్ర ఏర్పాట్లను డైరెక్టరు జనరల్ సమీక్షించారు. ఉత్తరాఖండ్ లోని లిపులేఖ పాస్, సిక్కింలోని నాథులా పాస్ మీదుగా మానససరోవర్ యాత్ర చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. మానససరోవర్ యాత్ర కు 18 బృందాలకు అనుమతి ఇచ్చామని దేశాయ్ వివరించారు.

Check Also

మంగల్‌ పాండే వివాదాస్పద వ్యాఖ్యలు

Share this on WhatsAppపట్నా: బీహార్ లో మెదడువాపు వ్యాధి బారిన పడి 103 మంది చిన్నారు మృతి చెందిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *