Breaking News
Home / Lifestyle / Astrology / శబరిమల తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను ….

శబరిమల తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను ….

న్యూఢిల్లీ : శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై సెప్టెంబరు 2018 నాటి తీర్పే చివరి మాట కాదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ బాబ్డే గురువారం వ్యాఖ్యానించారు. శబరిమల ఆలయ ప్రవేశానికి సంబంధించి 2018 తీర్పును అమలు చేస్తూ, ఆలయంలోకి ప్రవేశించాలనుకున్న మహిళలకు భద్రత కల్పించాల్సిందిగా కేరళ ప్రపోలీసు కమిషనర్‌ను కలుసుకుని తిరిగి వచ్చిన అమ్మణిపై యాసిడ్‌ దాడి జరిగిందని ఆమె చెప్పారు. సుప్రీంకోర్టు 2018లో ఇచ్చిన తీర్పుపై స్టే విధించలేదని ఈ సందర్భంగా జై సింగ్‌ గుర్తు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బాబ్డే స్పందిస్తూ శబరిమల తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను విస్తృత ధర్మాసనం పరిశీలించాల్సి ఉన్నందున 2018లో ఇచ్చిందే తుది తీర్పు కాదని చెప్పారు. కేరళకు చెందిన మరో మహిళ ఫాతిమా ఎఎస్‌ దాఖలు చేసిన అదేవిధమైన పిటిషన్‌ను కూడా కలిపి వచ్చేవారం విచారణ జరిపేందుకు జస్టిస్‌ బాబ్డే అంగీకరించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *