Breaking News
Home / National / టీఆర్‌ఎస్‌ను ఓడించడమే మహాకూటమి లక్ష్యం: రేవూరి

టీఆర్‌ఎస్‌ను ఓడించడమే మహాకూటమి లక్ష్యం: రేవూరి

వరంగల్: టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా మహాకూటమి ఏర్పడిందని టీ.టీడీపీ నేత రేవూరి ప్రకాష్‌రెడ్డి అన్నారు. కూటమిలో పార్టీలు వేరైనా లక్ష్యం ఒక్కటే అని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తు చారిత్రక అవసరమన్నారు. ఎంతో మంది అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ…ప్రస్తుతం ఓ కుటుంబపరమైందని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను టీఆర్ఎస్ నెరవేర్చలేదని ఆయన అన్నారు. ఎన్నికల్లో కేసీఆర్‌కు భంగపాటు తప్పదని స్పష్టం చేశారు. నర్సంపేట నుంచి పోటీ చేస్తే విజయం తనదే అని…సర్వేల్లో ఇదే తేలిందన్నారు. తనకు ఇవే చివరి ఎన్నికలని రేవూరి స్పష్టం చేశారు.

Check Also

శాసనమండలిలో అనూహ్యమైన సంఘటన

Share this on WhatsAppఅమరావతి: అధికార, ప్రతిపక్ష నేతల మధ్య విమర్శలతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి. ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *