1999లో పాకిస్తాన్ పేసర్ షోయబ్ అక్తర్ అత్యంత వేగంగా బంతులు విసిరిన స్పెల్‌గా తనకు ఎప్పటికి గుర్తుండిపోతుందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. 1999లో పాక్ జట్టు తమ దేశంలో పర్యటించింది. కాగా పెర్త్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అక్తర్ ఒక ఓవర్లో ప్రతీ బాల్‌ను గంటకు 150 కిలోమీటర్ల వేగంతో విసిరాడని గుర్తుచేశాడు. కాగా అంతకుముందు ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ తనకు వేసిన అత్యుత్తమ ఓవర్ అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
ఇదే విషయాన్ని రికీ పాంటింగ్ ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘ నా కెరీర్లో ఫ్లింటాఫ్ వేసిన ఓవర్‌ను బెస్ట్ ఓవర్‌గా చెప్పుకొన్న తర్వాత వెంటనే నాకు అక్తర్ వేసిన స్పెల్ గుర్తుకువచ్చింది. అక్తర్ వేసిన ప్రతీ బాల్ గంటకు 150 కిలోమీటర్ల వేగంతో సాగింది. వేసిన ప్రతీ బంతి నన్ను బాగానే ఇబ్బంది పెట్టింది. అక్తర్ అత్యంత ఫాస్ట్ బౌలింగ్‌ను కూడా నేను ఎప్పటికి మరిచిపోను’ అంటూ చెప్పుకొచ్చాడు. 2005లో జరిగిన యాషేస్ సిరీస్‌లో ఫ్లింటాఫ్ వేసిన ఒక ఓవర్ అత్యుత్తమ ఓవర్‌గా మిగిలిపోతుందని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఫ్లింటాఫ్ వేసిన ఓవర్ మొత్తంలో పాంటింగ్ బ్యాటింగ్ చేయడానికి అపసోఫాలు పడ్డాడు. చివరి బంతికి పాంటింగ్ ఏకంగా వికెట్ సమర్పించుకొని వెనుదిరిగాడు. కాగా పాంటింగ్ తన కెరీర్లో అన్ని ఫార్మాట్లు కలిపి 27, 486 పరుగులు చేశాడు. అంతేగాక పాంటింగ్ ఈ తరంలో ఉత్తమ కెప్టెన్‌గానూ నిలవడమే గాక 2003, 2007 ప్రపంచకప్‌లు జట్టుకు అందించడంలో ముఖ్య పాత్ర పోషించాడు.
Got plenty of questions the other day after calling the Flintoff over the best I'd faced.
This from @shoaib100mph was the fastest spell I'd ever faced and trust me Justin wasn't backing up too far at the other end. pic.twitter.com/JhhuEwXrAc
— Ricky Ponting AO (@RickyPonting) April 15, 2020