Breaking News
Home / Lifestyle / Business / ఓపెన్ సేల్‌లోనూ లభించనున్న రియల్‌మి…

ఓపెన్ సేల్‌లోనూ లభించనున్న రియల్‌మి…

ముంబయి: రియల్‌మికి చెందిన రియల్‌మి ఎక్స్‌టీ స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పటి వరకు కేవలం ఫ్లాష్ సేల్‌లోనే విక్రయించారు. కానీ ఈ ఫోన్ ఇప్పుడు ఓపెన్ సేల్‌లోనూ లభిస్తున్నది. అక్టోబర్ 4వ తేదీ వరకు ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఈ ఫోన్‌ను ఓపెన్ సేల్‌లో విక్రయించనున్నారు. కాగా ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.15,999 ఉండగా, 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.16,999గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.18,999గా ఉంది. రియల్‌మి ఆన్‌లైన్ స్టోర్‌లోనూ ఈ ఫోన్‌ను విక్రయిస్తున్నారు.

Check Also

జూలై 31 వరకు లాక్‌డౌన్

Share this on WhatsAppదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఒడిశాలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *