Breaking News
Home / States / Andhra Pradesh / గన్నవరం ఎయిర్‌పోర్ట్ వద్ద రోడ్డు ప్రమాదం……

గన్నవరం ఎయిర్‌పోర్ట్ వద్ద రోడ్డు ప్రమాదం……

కృష్ణా: గన్నవరంలో దారుణం చోటుచేసుకుంది. విమానాశ్రయ సమీపంలో గురువారం జరిగిన ఘటనలో ఓ మహిళా మృతిచెందింది. కాగా సైకిల్‌పై వెళ్తున్న భార్యభర్తలను వెనక నుంచి వస్తున్న ఐసన్‌ వ్యాన్‌ ఢీకొట్టడంతో భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్త తీవ్రంగా గాయపడ్డాడు. భార్యభర్తలు కేసరపల్లికి చెందిన వారని, మేధా టవర్స్‌లో విధులకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *