హైదరాబాద్: తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పెద్ద అంబర్పేట్ దగ్గర ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో దంపతులు మృతి చెందారు. మృతులను అబ్దుల్లాపూర్మెట్ మండలం కోహెడ వాసులుగా పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
