Breaking News
Home / States / Andhra Pradesh / టెన్త్ పాస్ అయిన ఆనందం అంతలోనే ఆవిరి

టెన్త్ పాస్ అయిన ఆనందం అంతలోనే ఆవిరి

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం కల్వచర్లలో విషాద ఘటన చోటుచేసుకుంది. టాటా ఏస్ వాహనం ఢీకొని పదవ తరగతి విద్యార్థిని రుక్మిణి(15) మృతి చెందింది. పదవ తరగతి పాసయ్యానన్న ఆనందంలో కూల్ డ్రింక్ కొనుక్కునేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సంతోష సమయంలో తమ కూతురు చనిపోవడంతో బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. టాటా ఏస్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.

Check Also

బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ

Share this on WhatsAppఏలూరు: సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ (బీఏఎస్‌) పథకంలో 2019-20 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *