Breaking News
Home / States / Andhra Pradesh / కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం…

కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం…

కడప: రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం కడప జిల్లాలో చోటు చేసుకుంది. కడప జిల్లా ప్రొద్దుటూరు రామేశ్వరం బైపాస్‌ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108 కు కాల్‌ చేశారు. ఎంతసేపటికీ 108 వాహనానం రాకపోవడంతో పరిస్థితి విషమించి వ్యక్తి మృతి చెందాడు.  మృతుడు ఖలీల్‌ (30) గా గుర్తించారు. స్థానికులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *