కడప: స్కూటర్ ను లారీ ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం కడపలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో స్కూటర్పైనున్న తురకకోట వీధికి చెందిన మౌలాలి (22) అక్కడికక్కడే మృతి చెందాడు. మౌలాలికి 25 రోజుల ముందు విహహమైనట్లు సమాచారం. మౌలాలి మరణవార్త విన్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
