కడప : ఇంట్లోకి లారీ దూసుకువెళ్లిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కడప జిల్లా రాజంపేట మండలం ఊటుకూరు గ్రామం వద్ద శనివారం రాత్రి లారీ అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు రూరల్ సిఐ నరసింహులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
