Breaking News
Home / States / ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం….

ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం….

ఖమ్మం: కూసుమంచి మండలం చేగోమ్మ క్రాస్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గాయపడిన వారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. కొత్తగూడెం భద్రాచలం డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు భద్రాచలం నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *