కర్నూలు: కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాపిలి మండలం జాతీయ రహదారిపై లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
