Breaking News
Home / States / మంచిర్యాలలో రోడ్డు ప్రమాదం….

మంచిర్యాలలో రోడ్డు ప్రమాదం….

మంచిర్యాల: తాండూరు మండల కేంద్రానికి సమీపంలో ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. లారీ డ్రైవర్.. సీటు, స్టీరింగ్ మధ్యలో ఇరుక్కుపోయి, బయటకు రాలేకపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీటులో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను పోలీసులు, వెల్డింగ్ సిబ్బందిని పిలిపించి గ్యాస్ కట్టర్ ఉపయోగించి వెలికితీశారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *