కృష్ణా: స్కూటీని లారీ ఢీకొనడంతో ఒకరు మృతి చెందిన ఘటన విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో జరిగింది. నిడమానూరు మోడల్ డైరీ సమీపంలో స్కూటీని లారీ ఢీకొట్టింది. స్కూటీపై ప్రయాణిస్తున్న ఇరువురిలో ఒకరు మృతి చెందగా… మరొకొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతురాలిని ఉదయగిరి హరిప్రియగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
