Breaking News
Home / States / ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి…

ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి…

నిజామాబాద్‌ : నిజామాబాద్‌ నగరంలోని ఎన్టీఆర్‌ చౌరస్తా వద్ద బుధవారం ఓ ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందింది. నగరంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన అబీబా బేగం(45) ఇంటినుంచి మార్కెట్‌ వైపు నడుచుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో ఆర్టీసీ అద్దె బస్సు నందిపేటనుంచి నిజామాబాద్‌ వైపు వస్తోంది. ఎన్టీఆర్‌ చౌరస్తా వద్ద వెనుకనుంచి అబీబా బేగంను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మరణించింది. బస్సు డ్రైవర్‌ కర్షక్‌ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నామని ఎస్‌హెచ్‌వో అధికారులు తెలిపారు. కాగా అనుభవం లేని డ్రైవర్‌ బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *