పెద్దపల్లి: పట్టణంలోని శాంతినగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఓ కారు ఢీ కొట్టగా.. బైక్పై వెళ్తున్న వ్యక్తి మరణించాడు. కమాన్పూర్ మండలం జూలపల్లికి చెందిన భార్యాభర్తలైన రాయలింగం(70), లింగమ్మ ద్విచక్ర వాహనంపై బ్రిడ్జి సమీపంలో వెళ్తున్నారు. ఈ క్రమంలో వారికి ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన ఓ కారు వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాయలింగం అక్కడికక్కడే మృతి చెందగా.. లింగమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కారు నడిపిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తీవ్ర గాయాల పాలైన లింగమ్మ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.
