Breaking News
Home / States / Andhra Pradesh / పీలేరులో రోడ్డు ప్రమాదం…

పీలేరులో రోడ్డు ప్రమాదం…

పీలేరు : రోడ్డు దాటుతున్న ఇద్దరు విద్యార్థులను కారు ఢీకొన్న ప్రమాదంలో ఇరువురూ గాయపడిన సంఘటన గురువారం రాత్రి పీలేరు – చిత్తూరు జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఎంజెఆర్ కళాశాలలో సివిల్ డిప్లమా మొదటి సంవత్సరం విద్యార్థులైన సంజయ్ కుమార్ యాదవ్ (16), హరీష్ (16) చిత్తూరు రోడ్డులోని  ఏంజెఆర్ హాస్టల్లో ఉంటున్నారు. గురువారం రాత్రి ఎదురుగా ఉన్న హోటల్ లో టీ తాగి తిరిగి వచ్చేందుకు రోడ్డు దాటుతుండగా పీలేరు వైపు నుంచి వేగంగా వచ్చిన కారు ఇద్దరు విద్యార్థులను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడి స్థానికులు గాయపడిన విద్యార్థులను పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పీలేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *