సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా సదాశివనగర్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్-2 డిపోకు చెందిన బస్సు-టాటా ఏస్ ని ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో 15మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో అనుభవం లేని డ్రైవర్లు బస్సులు నడిపిస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక ఉద్యోగులతో ప్రభుత్వం బస్సులను నడిపిస్తున్నా.. అనుభవరాహిత్యం వల్ల పలు చోట్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
