తిరుపతి : బైక్ ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటన మంగళవారం హార్స్ లీ హిల్స్ ఘాట్ రోడ్డులో చోటు చేసుకుంది. బైక్ ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో.. బైక్ పై ఉన్న ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరు కడపకు చెందిన వాసులుగా స్థానికులు గుర్తించారు. గాయపడిన విద్యార్థులను మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు విచారణ చేపట్టారు.
